
జనరల్

మంచి కథలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే నేచురల్ స్టార్ నాని, స్టార్ దర్శకులతో పాటు ప్రతిభ ఉన్న కొత్త దర్శకులతో కూడా పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. తాజాగా 'బ్లాస్ట్' సినిమాతో మంచి విజయాన్ని అందుకుని గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు సుభాష్ కె. రాజ్‌తో నాని సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సమాచారం ప్రకారం ఇప్పటికే సుభాష్ కె. రాజ్ నానికి కథ వినిపించగా, ఆ కథ ఆయనకు నచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు నాని ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో చర్చ సాగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!