
క్రీడలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ధురంధర్ ఫ్రాంచైజీతో గుర్తింపు పొందిన ఆదిత్య ధర్, తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రభాస్‌తో చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాల ఫ్రాంచైజీగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ధురంధర్ 2: ది రివెంజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశమున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రభాస్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 23న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!