
సినిమాలు

ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కాబో వెర్డ్‌పై 3-2 తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. అయితే ఈ విజయంతో సంతృప్తి చెందని కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంకా ఎన్నో లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
మొదటి గోల్ తర్వాత మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోయామని, ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయామని మెస్సీ అంగీకరించాడు. కాబో వెర్డ్ పోరాట స్ఫూర్తిని ప్రశంసించిన ఆయన, నాకౌట్ దశలో ప్రతి మ్యాచ్ కఠినమేనని గుర్తుచేశారు. జులై 7న అట్లాంటాలో ఈజిప్టుతో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలని సహచర ఆటగాళ్లకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!