

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని 2027 తొలి భాగంలో కాకుండా డిసెంబర్ 2027లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప సిరీస్ డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించడంతో అదే సెంటిమెంట్‌ను ‘రాకా’ కోసం కూడా అనుసరిస్తున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
సమాంతర ప్రపంచాలు, పునర్జన్మలు, భవిష్యత్ నేపథ్య అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుందని టాక్. రూ.800 కోట్లకు పైగా వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ బహుళ పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే విడుదల తేదీ, నటీనటుల వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!