
జనరల్

సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించగా, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘జైలర్ 2’ చిత్రీకరణను పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు తన 173వ చిత్రాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!