

ప్రస్తుతం భారతీయ సినిమా నుంచి వస్తున్న పలు భారీ చిత్రాలు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా నేరుగా టార్గెట్ చేస్తున్నాయి. కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఈ సినిమాకు లయన్స్‌గేట్‌తో భాగస్వామ్యం కూడా ఏర్పడింది. మరోవైపు యష్ నిర్మాణంలో వస్తున్న రామాయణకు సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో భాగస్వామ్యం ఏర్పడినట్లు సమాచారం. దీంతో భారతీయ సినిమాల్లో అంతర్జాతీయ కొలాబరేషన్స్‌పై ఆసక్తి పెరుగుతోంది.
ఇదే బాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ రాకా కూడా అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ కొలాబరేషన్ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించినదా, నిర్మాణానికి సంబంధించినదా లేదా మరేదైనా అంశమా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చాలా కాలంగా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఈ సినిమాలో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన నటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. అంతర్జాతీయ భాగస్వామ్యం, విల్ స్మిత్ ఎంట్రీపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!