
క్రీడలు

రవితేజ కుమార్తె మోక్షధ ‘ఇరుముడి’ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఆమె పాత్ర ఆ బాధ్యతలకే పరిమితం కాలేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభ దశ నుంచే కథ, నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే విషయంలో రవితేజ తొలుత కొంత సందిగ్ధతలో ఉన్న సమయంలో మోక్షధ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కథపై నమ్మకంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా ఆమె చేసిన ప్రయత్నాలు ‘ఇరుముడి’ ప్రారంభానికి దోహదపడ్డాయని టాక్. నిర్మాణ బాధ్యతలతో పాటు తొలి దశ నుంచే ప్రాజెక్ట్‌పై ఆమె చూపిన ఆసక్తికి తగిన గుర్తింపు దక్కాలని సినీ వర్గాలు అంటున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!