

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఆర్సీ17’పై చాలా కాలంగా భారీ ఆసక్తి నెలకొంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత కథ, స్క్రిప్ట్ రూపకల్పనకు ఎక్కువ సమయం పట్టడంతో సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది. తాజాగా సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించిన తుది కథను, స్క్రిప్ట్‌ను పూర్తి చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
త్వరలోనే రామ్ చరణ్‌ను కలిసి పూర్తి కథను వినిపించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. చరణ్ నుంచి ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!