

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా కథ, ప్రభాస్ పాత్రకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా సినిమాలోని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ కనిపించే ఓ కీలక సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ సన్నివేశం క్లైమాక్స్‌కు ముందు కథను కీలక మలుపు తిప్పుతుందని, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే ట్విస్ట్ కూడా ఇందులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సీక్వెన్స్ ప్రభాస్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని చిత్రబృందం నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’లో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. త్రుప్తి దిమ్రి కథానాయికగా నటిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రభాస్ పూర్తిగా వైల్డ్, మాస్ అవతార్‌లో కనిపిస్తాడని సమాచారం. కథాంశం కూడా ఇప్పటివరకు వచ్చిన పోలీస్ కథలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. సందీప్ రెడ్డి వంగా శైలిలో కథ, పాత్రలను బలంగా తీర్చిదిద్దుతున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!