
సినిమాలు

డాన్స్, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె మధ్యలో తప్పుకున్న ‘లెనిన్’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో శ్రీలీలకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ధర్మాన్’లో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ నిజమైతే శ్రీలీల కెరీర్‌కు ఇది మరో భారీ అవకాశంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!