

నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా, వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే శ్రీలీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బాలకృష్ణ సూచనతోనే ఆమె పేరును పరిశీలిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇప్పటికే శ్రీలీల.. కన్నడ హీరో విరాట్ ‘కిస్’, రోషన్ మేకా ‘పెళ్లి సందడి’, కిరీటి రెడ్డి ‘జూనియర్’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఈ ముగ్గురు హీరోల తొలి చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్గా కనిపించడం విశేషం. ఇప్పుడు మోక్షజ్ఞ తొలి సినిమాలోనూ నటిస్తే.. ఇండస్ట్రీకి నాలుగో హీరోను పరిచయం చేసిన హీరోయిన్గా అరుదైన గుర్తింపు దక్కే అవకాశం ఉంది. అయితే మోక్షజ్ఞ కంటే ముందే పలువురు స్టార్ హీరోలతో శ్రీలీల నటించడంతో ఈ కాంబినేషన్‌పై కొందరు నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వశిష్ట లేదా మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!