
షోస్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఆ దేశ విదేశాంగ శాఖ నేడు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శనివారం ఉదయం 11 గంటల సమయంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆదివారం దాదాపు అదే సమయానికి ఆయన తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో షీ జిన్‌పింగ్‌తో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు, వ్యాపార ప్రతినిధులు భారత్‌కు రానున్నారు.
ఏడేళ్ల తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే రెండోసారి కానుంది. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను చైనా విదేశాంగ శాఖ ప్రకటన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!