

‘పెద్ది’ సినిమాతో విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్.. ఇప్పుడు తన 17వ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌తో కలిసి తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో రానున్న రెండో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం. డిసెంబరు నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా కోసం రామ్‌చరణ్ ప్రత్యేకమైన, నాజూకైన లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాత్రకు తగ్గట్టుగా ఆయన బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ‘రంగస్థలం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి చరణ్ కోసం సుకుమార్ ఎలాంటి శక్తిమంతమైన కథను, వైవిధ్యభరితమైన పాత్రను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!