

టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా రిలేషన్షిప్లో ఉన్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. ఈవెంట్లు, వెకేషన్లకు కూడా కలిసి హాజరైన నేపథ్యంలో వీరి మధ్య డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే గతంలో ఈ వార్తలపై స్పందించిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తాము మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. అయినప్పటికీ వీరిపై వస్తున్న పుకార్లకు మాత్రం తెరపడలేదు. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోవడంతో ఈ రూమర్స్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
వినాయక చవితి సందర్భంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటోను తరుణ్ భాస్కర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నటి మంచు లక్ష్మితో పాటు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందించారు. ఈ ఫొటోతో వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై పరోక్షంగా హింట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే వీరి రిలేషన్షిప్ లేదా పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!