

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి జతకట్టారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
మోషన్ పోస్టర్‌లో ఓ భవనం పైనుంచి కరెన్సీ నోట్లు కిందకు పడుతుండగా, వాటిని పట్టుకునేందుకు శ్రీవిష్ణు పడే పాట్లు నవ్వులు పూయిస్తున్నాయి. పోస్టర్‌లోనే ఇంత కామెడీ కనిపించడంతో సినిమా పూర్తిస్థాయి కుటుంబ వినోదంగా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. శ్రీవిష్ణు ప్రత్యేకమైన హావభావాలు, రామ్ అబ్బరాజు కామెడీ టేకింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ‘ఫ్యామిలీ ప్యాక్’ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!