

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌సీ 17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. సినిమా షూటింగ్ దసరా నుంచి ప్రారంభం కానుందనే ప్రచారం జరుగుతున్న వేళ, తాజాగా సంగీత దర్శకుడి విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ సినిమాలకు ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు వరుసగా సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో ‘ధురంధర్’ ఫేమ్ శశ్వత్ సచ్‌దేవ్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
సుకుమార్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్ చాలావరకు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. అయితే డీఎస్పీ ప్రస్తుతం ‘ఎల్లమ్మ’తో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో డేట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య ‘పుష్ప’ సమయం నుంచి కొన్ని విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా కొనసాగుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరకు ఈ మనస్పర్థలు కొనసాగినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌సీ 17 యూనిట్ నుంచి అధికారికంగా శుభాకాంక్షలు రాకపోవడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే ఈ మార్పుపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!