

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన చివరి టెస్టులో నిర్దేశిత సమయంలో 11 ఓవర్లు తక్కువగా వేసినందుకు పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఖాతా నుంచి 11 పాయింట్లు తగ్గించింది. సమయ మినహాయింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా 11 ఓవర్ల లోటు ఉన్నట్లు ఐసీసీ తేల్చింది. దీంతో ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం జరిమానా విధించింది.
నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో వేయాల్సిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం చొప్పున జరిమానా విధిస్తారు. గరిష్ఠంగా 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాకిస్థాన్ 11 ఓవర్లు తక్కువగా వేయడంతో గరిష్ఠ జరిమానా అమలైంది. వరుస పరాజయాలతో డబ్ల్యూటీసీ పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పటివరకు తొమ్మిది టెస్టుల్లో కేవలం రెండు విజయాలు సాధించి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల శాతం 4.63గా ఉంది. తదుపరి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ తలపడనుంది. ఈ సిరీస్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా, రావల్పిండి, లాహోర్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!