

హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఆ డ్రోన్ ఏ లక్ష్యంతో అక్కడకు వెళ్లింది, దాని మిషన్ వివరాలు ఏమిటన్న విషయాన్ని ఇరాన్ వెల్లడించలేదు. హోర్ముజ్ జలసంధి వద్ద కొన్ని నెలలుగా అమెరికాకు చెందిన మానవరహిత విమానాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
మరోవైపు ఇరాన్ చమురు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్ ముడి చమురుపై అమెరికాకు పట్టు లభించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. వెనెజువెలా తరహాలో ఇరాన్ చమురు బావులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. వెనెజువెలా చమురు ద్వారా వచ్చిన ఆదాయం గతంలో పలుమార్లు యుద్ధానికి సహకరించిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఈ ఏడాదిలోనే ముగుస్తుందని కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!