

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇటీవలి కాలంలో కథలు, పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘బుజ్జిగాడు’, ‘యమదొంగ’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఈ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ మోహన్ బాబు కెరీర్‌లో కీలకంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని, కథను మలుపు తిప్పే స్థాయిలో ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!