17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

Writer: Nithish 10:40 AM, 17 నవంబర్, 2026
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ గాయం కారణంగా రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన 37వ ఓవర్‌లో బంతి శాంట్నర్‌ కుడిచేతి వెనుక భాగానికి బలంగా తగిలింది. ఫిజియో చికిత్స అనంతరం అతడు బ్యాటింగ్‌ కొనసాగించి 24 పరుగులు చేశాడు. అయితే, స్కానింగ్‌లో చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. అతడు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై స్పష్టత లేదని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.

ఫాక్స్‌క్రాఫ్ట్‌కు జట్టులో చోటు

శాంట్నర్‌ స్థానంలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు. వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు 39 పరుగులు చేశాడు. నవంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఫాక్స్‌క్రాఫ్ట్‌కు తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా ఎ, న్యూజిలాండ్‌ ఎ జట్ల మధ్య జరిగిన అనధికార టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 51, 42, 93, 10 పరుగులు సాధించాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన న్యూజిలాండ్‌ జట్టులో టామ్‌ లాథమ్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, డెవాన్‌ కాన్వే, జాకబ్‌ డఫీ, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, మాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, డారిల్‌ మిచెల్‌, హెన్రీ నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, నాథన్‌ స్మిత్‌, బ్లెయిర్‌ టిక్నర్‌, విల్‌ యంగ్‌ ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ట్యాగ్లు
మిచెల్‌ శాంట్నర్‌న్యూజిలాండ్‌ క్రికెట్‌భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌టెస్టు సిరీస్‌డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌అర్ష్‌దీప్‌ సింగ్‌న్యూజిలాండ్‌ జట్టుక్రికెట్‌ వార్తలుటీమ్‌ఇండియాస్పిన్‌ ఆల్‌రౌండర్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్
క్రీడలు

తొలి టెస్టుకు టీమిండియా వ్యూహం ఇదే.. తుది జట్టుపై గిల్ కీలక అప్‌డేట్

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌
సినిమాలు

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి మరో అప్‌డేట్‌

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు గ్లోబల్ వేదిక.. ఇండియా జాయ్ 2026

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

బాలీవుడ్‌లో స్వచ్ఛమైన ప్రేమకథలు మిస్ అవుతున్నాయి.. తాప్సీ పన్ను ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్

జస్టిస్ వినోద్ కుమార్ సేవలకు హైకోర్టు ప్రశంసలు.. ఘనంగా వీడ్కోలు
జనరల్

జస్టిస్ వినోద్ కుమార్ సేవలకు హైకోర్టు ప్రశంసలు.. ఘనంగా వీడ్కోలు

ఎన్విడియా సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీ ఎంట్రీకి బోర్డు నో
బిజినెస్

ఎన్విడియా సీఈఓగా జెన్సన్‌ హువాంగ్‌ రీ ఎంట్రీకి బోర్డు నో

ఎన్టీఆర్ రెండు సినిమాలూ ఒకేసారి?
గాసిప్స్

ఎన్టీఆర్ రెండు సినిమాలూ ఒకేసారి?

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన
క్రీడలు

ఐపీఎల్ 2027: ధోనీని సీఎస్‌కే రిలీజ్ చేయాలి.. అశ్విన్ కీలక సూచన

కీళ్ల నొప్పులు, వాపులకు ఆముదం ఆకులు.. వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

కీళ్ల నొప్పులు, వాపులకు ఆముదం ఆకులు.. వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!