

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘లెనిన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే విడుదల తేదీ సమీపిస్తున్నప్పటికీ చిత్ర ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ప్రారంభం కాకపోవడం, ట్రైలర్ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ‘లెనిన్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. విడుదల తేదీ యథాతథంగా ఉంటుందా లేదా మార్పు ఉంటుందా అన్నది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!