

విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన’పై అంచనాలు భారీగా ఉన్నాయి. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్న విజయ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ముఖ్యంగా కోనసీమ గ్రామీణ నేపథ్యం, రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుందని సమాచారం. యాక్షన్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌కు కూడా సినిమాలో కీలక స్థానం ఉందట.
భావోద్వేగాలతో కూడిన కథను యాక్షన్ సన్నివేశాలతో మేళవించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ సరసన కీర్తి సురేశ్ నటించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మొత్తంగా గ్రామీణ నేపథ్య కథ, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు ఈ సినిమాకు బలంగా మారనున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!