

ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు దిండు తడిసిపోవడం చాలా మందికి కనిపించే సాధారణ సమస్య. చిన్నపిల్లల్లో ఇది సహజమే కానీ పెద్దవారిలో తరచుగా జరిగితే ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. గాఢ నిద్రలో ముఖం, నోటి కండరాలు పూర్తిగా రిలాక్స్ అవడం వల్ల లాలాజలం మింగలేక బయటకు రావచ్చు, ముఖ్యంగా పక్కగా పడుకున్నప్పుడు. జలుబు లేదా అలర్జీల వల్ల ముక్కు బ్లాక్ అయితే నోటి ద్వారా శ్వాస తీసుకోవడం పెరిగి లాలాజలం ఎక్కువగా కారుతుంది. అలాగే స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవారిలో లేదా గురక ఎక్కువగా పెట్టేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ కండరాల బలహీనత లేదా నరాల సమస్యల వల్ల కూడా లాలాజలం నియంత్రణ తగ్గుతుంది.
లాలాజలం కారడమే కాకుండా గురక ఎక్కువగా పెట్టడం, నిద్రలో ఉక్కిరిబిక్కిరి అవడం, ఆహారం లేదా నీరు మింగడంలో ఇబ్బంది, మాట్లాడే విధానంలో మార్పులు లేదా శరీర బలహీనత కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నివారణ కోసం పడుకునే భంగిమ మార్చడం, ముఖ్యంగా వెన్నుపై నేరుగా పడుకోవడం మంచిది. అలాగే ముక్కు బ్లాక్ లేదా అలర్జీలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ చిన్న మార్పులు పాటించడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!