

కారణం తెలియని దిగులు, చెప్పుకోలేని బాధ, జీవితంపై నైరాశ్యం వంటి భావాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చాలామందికి తాము డిప్రెషన్‌తో బాధపడుతున్నామనే విషయం కూడా తెలియకపోవచ్చు. సమస్య తీవ్రరూపం దాల్చే వరకు కొందరు వైద్య సహాయం తీసుకోవడం లేదు. మానసిక సమస్యలపై అవగాహన పెంచడం, బాధితులు సకాలంలో సహాయం పొందేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
గతంలో ఆనందాన్నిచ్చిన పనులు, హాబీలపై ఆసక్తి కోల్పోవడం, నిద్రలేమి లేదా అతిగా నిద్రపోవడం, నిరంతర భయం, అతిగా ఆలోచించడం, పానిక్ అటాక్స్, ఇతరులకు భారమనే భావన, స్వీయహాని గురించి మాట్లాడటం వంటి లక్షణాలు డిప్రెషన్‌లో కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే మానసిక వైద్యులను సంప్రదించాలని మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ హసంతి తుమ్మూరోతు సూచిస్తున్నారు. ఇంట్లో, కార్యాలయాల్లో, పాఠశాలల్లో, ఆస్పత్రుల్లో మానసిక సమస్యలతో బాధపడేవారి మాటలను శ్రద్ధగా వినాలని, వారి అనుభవాలను గౌరవిస్తూ తీర్పులు ఇవ్వకుండా అండగా నిలవాలని ఆమె పేర్కొన్నారు.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఆరోగ్యంపై ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి, వారి సూచనలను పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!