

అసమతుల్య ఆహారం, జీవనశైలి కారణంగా వచ్చే పొట్ట ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలను ఆయుర్వేద పద్ధతుల ద్వారా సహజంగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం జీర్ణక్రియ బలహీనపడటం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్లం, వాము, సోంపు, త్రిఫల వంటి మూలికలు జీర్ణక్రియను మెరుగుపరచి కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
ఆయుర్వేద చికిత్సతో పాటు సరైన జీవనశైలి కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. గోరువెచ్చటి నీరు తాగడం, జీలకర్ర, ధనియాలు, సోంపుతో చేసిన హెర్బల్ టీలు ఉపయోగించడం జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అతిగా తినడం మానుకోవడం, సమయానికి భోజనం చేయడం, ఆహారాన్ని బాగా నమలడం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించడం అవసరం. సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!