
జనరల్

కేరళలో నిఫా వైరస్‌కు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ సరిహద్దుకు ఆనుకుని ఉన్న కోయంబత్తూర్, థేని, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
నిఫా లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తులను గుర్తించి వైద్య శిబిరాలకు తరలిస్తూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్ చర్యలు చేపడుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!