

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షమ్దత్ సైనుద్దీన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’. వి. చుడామణి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ను నేడు నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు విడుదల చేశారు. ఇంద్ర రామ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన కథాంశంతో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో కథానాయకుడు నిద్రపోయిన ప్రతిసారీ మృత్యువుకు మరింత దగ్గరవుతుంటాడు. అంతేకాకుండా, అతనికి వచ్చే కలలు నిజమవుతుండటంతో నిద్రకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతడిని నిరంతరం వెంటాడే ప్రతినాయకుడిగా రవీంద్ర విజయ్ నటిస్తున్నారు. కథానాయకుడి మానసిక సంఘర్షణను ప్రతిబింబించేలా టీజర్లోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. వెన్నెల కిషోర్, దేవా కట్టా, టాబా రీమా, జోయితా బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!