
రాజకీయాలు

భారత్, శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ వేదిక మారింది. తొలుత డిసెంబర్ 13న ఢిల్లీలోని స్టేడియంలో నిర్వహించాల్సిన ఈ మ్యాచ్‌ను విశాఖపట్నానికి తరలించారు. ఢిల్లీ స్టేడియంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (DDCA) తెలిపింది. దీంతో వేదికను మార్చాలని నిర్ణయించారు.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) స్టేడియంలో తొలి వన్డే నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులను కూడా వేదిక మార్పునకు ఒక కారణంగా పేర్కొంటున్నారు. దీంతో డిసెంబర్ 13న జరగనున్న భారత్-శ్రీలంక తొలి వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!