

స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై తొలిసారిగా ఓ ఆసక్తికరమైన థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కనకరావు తొనంగి, అభిషేక్, ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాకు ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను హిట్ మెషీన్ అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్ డిజైన్‌లో ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ వంటి పదాలను పొందుపరచడం ద్వారా కథపై ఆసక్తిని పెంచారు. అమ్మాయిల అదృశ్యం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ సాగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో మరిన్ని ఊహించని అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఫస్ట్ లుక్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రాహుల్ విజయ్ చేతిలో లాఠీ పట్టుకుని ఓ ప్రదేశంలో కూర్చుని కనిపిస్తుండగా, ఆయన చుట్టూ నేలపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని తెలుస్తోంది. రాహుల్ విజయ్ ఇంటెన్స్ లుక్, డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, జాన్ విజయ్, సుధర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు గ్యారీ BHతో కలిసి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ అంశాలతో సాధారణ మిస్సింగ్-గర్ల్స్ థ్రిల్లర్‌కు భిన్నమైన కథను చెప్పేందుకు ‘అ’ సిద్ధమవుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!