

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అదే జోష్‌తో ఆయన ఇప్పుడు ‘ఎపిక్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లండన్ నేపథ్యంలో సాగే ఆధునిక ప్రేమకథగా రూపొందుతోంది. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండకు తన ఫస్ట్ క్రష్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన నవ్వుతూ స్పందిస్తూ, సినిమాలు చూస్తున్నప్పుడు హీరోయిన్లపై క్రష్ వస్తుంటుందని చెప్పారు. ‘మురారి’ సినిమాలో సోనాలి బింద్రేను చూసినప్పుడు తనకు క్రష్ కలిగిందని, ముఖ్యంగా ఓ పాట చూసిన తర్వాత ఆ ఫీలింగ్ బలంగా అనిపించిందని తెలిపారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!