

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రత్యేక ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేస్తూ చిత్రబృందం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో రూపొందించిన వీడియోకు మంచి స్పందన లభించింది.
తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలతో రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా కథా నేపథ్యం రాయలసీమ ప్రాంతంలో సాగనున్నట్లు వెల్లడించారు. అయితే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించనుందని స్పష్టం చేశారు. నేటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ ప్రారంభానికి ముందే వరుస ప్రమోషన్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పడంలో అనిల్ రావిపూడి మరోసారి విజయవంతమయ్యారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!