

నటి సమంత ఇటీవల ఓ షోలో పాల్గొని తన వ్యాపార అనుభవాలు, ఎదుర్కొన్న వైఫల్యాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తొలి వ్యాపార భాగస్వామ్యం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు. అయితే, మొదటిసారి పెట్టుబడి పెట్టిన వ్యాపారం విఫలమైనా అది మంచిదేనని ఆమె అభిప్రాయపడ్డారు. విజయాల కంటే అపజయాలే ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయని తెలిపారు. తన జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలన్నీ వైఫల్యాల నుంచే వచ్చాయని, విజయాలు తనకు పెద్దగా కొత్త విషయాలను నేర్పించలేదని సమంత పేర్కొన్నారు. ప్రతి ఓటమి తనకు వ్యాపారం, జీవితం గురించి మరింత అవగాహన కల్పించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇదే షోలో వ్యాపార రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా సమంత మాట్లాడారు. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు మహిళల్లో భయం ఎక్కువగా ఉంటుందని అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభవమని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను దాదాపు 8 నుంచి 10 వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. వాటిలో ఎనిమిది సంస్థలకు మహిళలే వ్యవస్థాపకులుగా ఉండటం తనకు సంతోషాన్నిస్తోందని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి తమ వ్యాపార కలలను సాకారం చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమంత సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!