

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రివర్గ సహచరులు అభినందనలు తెలిపారు. క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయోత్సాహంతో పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తూ ఇద్దరు నేతలు సమావేశానికి చేరుకున్నారు. వారి మధ్య కనిపించిన ఉత్సాహం కూటమి శ్రేణుల్లో నెలకొన్న ఆనందాన్ని ప్రతిబింబించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశ మందిరంలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న మంత్రులు వారికి అభినందనలు తెలిపారు. చప్పట్లతో సమావేశ మందిరం మార్మోగిపోయింది. స్థానిక ఎన్నికల్లో కూటమికి లభించిన విజయాన్ని మంత్రులు కలిసి సంబరంగా జరుపుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వంలో నెలకొన్న ఉత్సాహభరిత వాతావరణానికి ఈ ఘటన అద్దం పట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!