

నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’లో కాయదు లోహర్ పాత్ర ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఆమె పాత్రను బోల్డ్‌గా, విభిన్నంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తెరపై ఆమె కనిపించే తీరు, పాత్రను మలిచిన విధానం సినిమాపై జరుగుతున్న చర్చలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు వైరల్ కావడంతో పాత్రపై ఆసక్తి పెరిగింది.
నానితో కాయదు లోహర్ కెమిస్ట్రీ, ఆమె లుక్, సినిమాలోని కొన్ని సన్నివేశాలు యువ ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తున్నాయి. అయితే కథనం ప్రధానంగా నాని పాత్ర, కేంద్ర సంఘర్షణ చుట్టూనే సాగుతున్నప్పటికీ కాయదు లోహర్ తన పాత్రతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా విడుదలైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!