

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఈ చిత్రంలో దిశా పటాని కథానాయికగా నటించగా.. శబానా అజ్మీ, శ్రియా శరన్ కీలక పాత్రల్లో కనిపించారు.
బుధవారం కలెక్షన్లలో 30 శాతం మేర స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద సినిమా జోరు మాత్రం కొనసాగింది. ఆ రోజున భారత్‌లో రూ.6.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించడంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్స్ రూ.107.50 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.128.29 కోట్లు కాగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.25.30 కోట్లు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ.153.59 కోట్లకు చేరుకున్నాయి. ఇదే జోరు కొనసాగితే రూ.200 కోట్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఇమ్రాన్ హష్మీ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘ఆవారాపన్ 2’ నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!