
గాసిప్స్

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కలయికలో తెరకెక్కనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఎన్‌బీకే112 దైవ ఆశీస్సులతో ప్రారంభం కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జూన్ 25 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్రమైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనుంది. సినిమా ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరిబాలకృష్ణ మరియు స్టార్ దర్శకుడు కొరటాలశివ కలయికలో రానున్న ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!