

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినీ ప్రస్థానంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్.. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తన అభిమాన హీరోపై భావోద్వేగ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్‌ను తన బాస్ అని సంబోధిస్తూ, ఆయన వల్లే తన జీవితానికి ఒక ప్రత్యేక గుర్తింపు, కొత్త దిశ లభించాయని కృతజ్ఞతలు తెలిపారు.
"నా ప్రియమైన బాస్, పవన్ కల్యాణ్ గారికి,మీరు సినిమాల్లో 30 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ నమ్మశక్యంకాని ఈ ప్రయాణాన్ని చూడటం నా మనసును గర్వంతో నింపేస్తుంది. ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో నాకు భాగం కల్పించారు. నాపై నమ్మకం ఉంచి, నన్ను నిర్మాతగా నిలబెట్టారు. నా జీవితానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును, కొత్త దిశను ఇచ్చింది మీరే.సార్, మీరు నాకిచ్చినవి కేవలం సినిమా అవకాశాలు కాదు. అవి నా జీవితాన్ని మార్చేసిన మధుర క్షణాలు. వాటిని నేను ఎప్పటికీ గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన ప్రోత్సాహం, అందించిన మద్దతును జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను.
మీ అసాధారణమైన 30 ఏళ్ల ప్రయాణంలో నేను ఒక చిన్న భాగంగా ఉండటాన్ని ఎప్పటికీ గొప్ప గౌరవంగా భావిస్తాను. మీరు భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు, మైలురాళ్లు అందుకోవాలని, ఇంకెన్నో ఘనమైన సంవత్సరాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీరు ఎప్పటికీ నా బాస్, సార్. మీపై నాకున్న గౌరవం, అభిమానం, కృతజ్ఞత నా గుండెల్లో శాశ్వతంగా ఉంటాయి.అంతులేని గౌరవం, శాశ్వతమైన కృతజ్ఞతలతో, ఎల్లప్పుడూ మీ, బండ్ల గణేశ్" అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!