
గాసిప్స్

‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన అందం, నటనతో కుర్రకారుని ఆకట్టుకున్న ఈ భామ, ఇతర భాషల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
అగ్రనటుడు మోహన్‌లాల్ నటిస్తున్న ‘ఎల్367’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాలు వెల్లడించాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!