
జనరల్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కఠిన నిర్ణయం తీసుకోవడం సినీ పరిశ్రమలో చర్చకు దారితీసింది. సంస్థ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ పనిచేసే చిత్రాలకు తమ సభ్యులు సహకరించబోరని ప్రకటించింది.
ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఫెడరేషన్ పేర్కొంది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని తెలిపింది. ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఇకపై ఆయనతో పనిచేయబోరని స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలో సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!