

ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోవడంతో దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి చిత్రాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కొత్త కథల రూపకల్పనలో నిమగ్నమైన ఆయన.. మరోసారి పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్యతో సినిమా చేయాలనే ఆలోచనతో ప్రత్యేక కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, భావోద్వేగాలు, భారీ మలుపులతో కూడిన కథను బోయపాటి తన బృందంతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పలు అంశాలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరో ప్రముఖ హీరో కోసం కూడా ఒక కథ సిద్ధంగా ఉంచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బహుభాషల్లో విడుదలయ్యేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రాకముందే ఈ కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!