

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. కీలక యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం మిగిలిన సన్నివేశాలను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి షూటింగ్ ముగించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే చిత్ర విడుదలకు ముందు అత్యంత కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడని రాజమౌళి ఈ దశకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటించిన విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చిత్రీకరణ ముగిసిన వెంటనే అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రాఫిక్స్ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రత్యేక వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే గ్లింప్స్ విడుదల కావడంతో ఈసారి వీడియోకు బదులుగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!