

అగ్ర కథానాయకుడు చిరంజీవి రాజకీయాల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళ హీరో విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. అయితే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో కథలో పలు మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు కామెడీకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పాటలు, ప్రేమకథ, కథనం విషయంలోనూ మార్పులు చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్ తదితరులతో కలిసి చిరంజీవి స్టామినాకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మరింతగా మార్చినట్లు సమాచారం.
మొదట ‘ఖైదీ నంబర్ 150’లో కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి ఇద్దరు కథానాయికలను అనుకున్నారట. అయితే షూటింగ్‌కు ముందు చిరంజీవి సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ఉండాలని సూచించడంతో కథలో మరోసారి మార్పులు చేశారు. చిరంజీవిని అనుమానించే వ్యక్తిగా బ్రహ్మానందం కోసం ప్రత్యేకంగా ‘డాబర్ మ్యాన్’ పాత్రను రూపొందించారు. దీంతో అనుష్క కోసం రాసిన ట్రాక్‌ను తొలగించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కాజల్ అగర్వాల్ సింగిల్ హీరోయిన్‌గా కొనసాగారు. సినిమాలో చిరంజీవి, బ్రహ్మానందం, అలీ మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!