

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సానా, విజయ్ దేవరకొండ స్టార్డమ్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ దేవరకొండకు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయి స్టార్ ఇమేజ్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘గీత గోవిందం’, తన చిత్రం ‘ఉప్పెన’కు పనిచేసిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన సంఘటనను ఈ సందర్భంగా బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ‘గీత గోవిందం’ షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్ను చూసేందుకు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపడంతో, కాలేజీ యాజమాన్యం తరగతి గదుల తలుపులు మూసివేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో ‘అర్జున్ రెడ్డి’ విడుదలైందని పేర్కొన్నారు.
పరిస్థితులు ఎలా ఉన్నా స్టార్ ఎప్పుడూ స్టార్గానే ఉంటాడని చెబుతూ, విజయ్ దేవరకొండకు పవన్ కళ్యాణ్ స్థాయి స్టార్ ఇమేజ్ ఉందని బుచ్చిబాబు అన్నారు. ఆయన ఈ పోలిక చేయగానే కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీయడంతో పాటు ‘రణబాలి’పై ఆసక్తిని మరింత పెంచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!