

హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై చింతాడ హేమారావు నిర్మాతగా, వీఐపీ – వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో ‘చకోర’ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ను కొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘చకోర’ చిత్రాన్ని ప్రశంసిస్తూ, ప్రతి విభాగంలోనూ మంచి నాణ్యత కనిపించిందని అన్నారు. హీరో శ్రవణ్, హీరోయిన్ మలైకా తమ పాత్రలకు చక్కగా సరిపోయారని, కథకు వారికంటే మరెవరూ సరైన ఎంపిక కాదనిపించేలా నటించారని ప్రశంసించారు. దర్శకుడు మంగా శ్రీనివాస్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, కొత్త తరహా ప్రేమకథగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!