

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రబృందం ఫస్ట్ కాపీ బిఫోర్ వెర్షన్‌ను వీక్షించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలు జోడిస్తే కథ మరింత ప్రభావవంతంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఒక రోజు పాటు రీషూట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. తమిళంలో ఈ చిత్రం ‘ఇరుముడికట్టు’ పేరుతో విడుదల కానుంది. గతంలో రవితేజ మాట్లాడుతూ, జీవితంలో కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయని, అలాంటి కథే ‘ఇరుముడి’ అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నకాస్త్ర నటిస్తోంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!