
రాజకీయాలు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయిందనే విషయంపై తాజాగా చిరంజీవి కీలక అప్డేట్ ఇచ్చారు.
యంగ్ హీరో సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ‘కాకా’ షూటింగ్ వివరాలను వెల్లడించారు. సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయిందని, సెకండాఫ్‌లో దాదాపు 30 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!