

యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్, టాలెంటెడ్ హీరో అశోక్ సెల్వన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్బిల్ అవన్’. దర్శకుడు ఆర్. కార్తికేయన్ తెరకెక్కిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు ప్రముఖ రచయిత విఘ్నేష్ రాజా కథ అందించారు. మ్యూజిక్ సెన్సేషన్ గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. హ్యాపీ హై పిక్చర్స్, ఐంగరన్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే తాజాగా విడుదల తేదీలో మార్పు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ట్రైలర్, ప్రచార కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అపూర్వమైన స్పందన, మద్దతుకు మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ వేదికల్లో వస్తున్న స్పందనతో పాటు డిస్ట్రిబ్యూటర్లు చూపిస్తున్న ఆసక్తి, నమ్మకం సినిమాను మరింత ఘనంగా, భారీ స్థాయిలో విడుదల చేయడానికి తమను ప్రోత్సహించాయని వెల్లడించారు. అందుకే ప్రేక్షకులకు మరింత వైభవంగా సినిమాను అందించాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చినట్లు తెలిపారు. దీంతో సెప్టెంబర్ 25న రావాల్సిన ‘అన్బిల్ అవన్’ ఇప్పుడు అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ అందమైన కథను ప్రేక్షకులతో పంచుకునేందుకు తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, అక్టోబర్ 2న థియేటర్లలో కలుద్దామని మేకర్స్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!