
క్రీడలు

రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై వచ్చిన విమర్శలకు హీరో ధనుష్ తాజాగా స్పందించారు. మహారాజా, సత్యం సుందరం వంటి చిత్రాలు కూడా మంచి సినిమాలేనని అంగీకరించిన ఆయన, వడ చెన్నై, కర్ణన్, మర్యన్ వంటి తన గత చిత్రాలు జాతీయ అవార్డులకు అర్హమైనప్పటికీ అవి గుర్తింపు పొందనప్పుడు ఎందుకు ఎవరూ ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వేల్స్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్, అభిమానులు ఐక్యంగా ఉండి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశాలు, ఆడియో వేడుకలకే పరిమితం కాకుండా ప్రజలకు సహాయం చేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఆయన ప్రసంగం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!