

ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా, శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో మంగళవారం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను రాజమౌళి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగం కానుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!