
జనరల్

సల్మాన్ ఖాన్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. వంగా స్టైల్‌లో సల్మాన్ నటిస్తే ఎలా ఉంటుందనే ఊహలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా వంగా ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పిరిట్ చిత్రంపై దృష్టి పెట్టగా, తరువాత యానిమల్ పార్క్ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. అలాగే అల్లుఅర్జున్తో కూడా భవిష్యత్ ప్రాజెక్ట్ ఉన్నట్లు టాక్ ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌తో సినిమా త్వరలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!